7న క్రిస్టినా కదిర్‌వేలన్
తమిళసినిమా: శ్రీలక్ష్మీ డ్రీమ్ ఫ్యాక్టరీ పతాకంపై డా.ఆర్.ప్రభాకర్ స్థపతి నిర్మించిన చిత్రం క్రిస్టినా కదిర్‌వేలన్. దీనికి మిస్టర్ డెల్లా క్రియేషన్స్ అధినేత కార్తీక్ వీరప్పన్ సహా నిర్మాతగా వ్యవహరించిన ఈచిత్రంలో కౌశిక్ రామ్, ప్రతిభ జంటగా నటించారు. సింగంపులి, గంజాకరుప్పు,జయకుమార్, అరుళ్ డీ.శంకర్, టీఎస్‌ఆర్, సిల్మిషమ్ శివ, జనని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా ఎస్‌జేఎన్.అలెక్స్ పాండ్యన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రహత్ మునుసామి చాయాగ్రహణంను, ఎన్‌ఆర్.రఘునందన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నవంబర్ 7న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. గురువారం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు ఎస్‌ఆర్.ప్రభాకరన్, విజయ్‌శ్రీ, మైఖెల్ కే.రాజా ఆడియోను ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ క్రిస్టినా కదిర్‌వేలన్ అనే పేరును పెట్టి ఇంతవరకూ చేసిన పయనాన్ని తాను విమాన పయనంగా భావిస్తున్నానన్నారు. రెండేళ్ల పాటు ఈ చిత్రం కోసం శ్రమించినట్లు చెప్పారు. ఈ చిత్ర నిర్మాతలు బంగారం లాంటివారని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన 20 నిమిషాల నిడివిని సెల్‌ఫోన్‌లోనే కార్తీక్ వీరప్పన్‌కు చూసించానని ,అవి చూసిన ఆయన ఎమోషన్ అయ్యి, ఇప్పటి వరకూ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఇది విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. సంగీత దర్శకుడు ఎన్‌ఆర్.రఘునందన్ చాలా మంచి సంగీతాన్ని అందించారని చెప్పారు.


