మెడికల్ క్రైమ్ ఇతివృత్తంతో అదర్స్
తమిళసినిమా: ఆదిత్య మాధవన్, గౌరీకిషన్ జంటగా నటించిన చిత్రం అదర్స్. నటి అంజుకురియన్, మునీష్‌కాంత్, హరీశ్ పెరడీ, మాలా పార్వతి, జగన్, ఆర్.సుందర్‌రాజన్ ముఖ్యపాత్రలు పోషించారు. గ్రాండ్ పిక్చర్స్ సంస్థ తో కలిసి అప్ 7 వెంచర్స్ అధినేత అధిరాజ్ పురుషోత్తమన్ నిర్మించిన చిత్రం అదర్స్. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిన్ హరిహరన్ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతం, అరవింద్‌సింగ్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నవంబర్ 7న తెరపైకి రానుంది. గురువారం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు అబిన్ హరిహరన్ మాట్లాడుతూ ఏడాది శ్రమ తరువాత ఈ స్థాయికి చేరుకున్న చిత్రం ఇదని చెప్పారు. ఆడిషన్ సమయంలోనే హీరో ఆధిత్య మాదవన్ అదరగొట్టారని అన్నారు. గౌరి కిషన్, అంజుకురియన్, హరీశ్ పెరడీ ఉత్తమ నటనను ప్రదర్శించారని చెప్పారు. అరవింద్‌సింగ్ పెద్ద చాయాగ్రాహకుడు అయినా తన ఊహలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు. జిబ్రాన్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద బలం అని అన్నారు. ఒక మంచి చిత్రం ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి మీడియా పాత్ర చాలా ఉంటుందని, తాము ఒక మంచి చిత్రాన్ని నిర్మించామని, నవంబర్ 7న విడుదల చేస్తున్న ఈ చిత్రానికి మీ ఆదరణ కావాలని సహ నిర్మాత ఆదిరాజ్ పురోషత్తమన్ అన్నారు.


