లంచం కేసులో ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

లంచం కేసులో ఇద్దరి అరెస్ట్‌

Nov 1 2025 7:46 AM | Updated on Nov 1 2025 7:46 AM

లంచం

లంచం కేసులో ఇద్దరి అరెస్ట్‌

తిరువళ్లూరు: ప్రమాదానికి గురైన వాహనాన్ని విడిపించడానికి లంచం తీసుకున్న ఎస్‌ఎస్‌ఐ సహా ఇద్దరిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా తారాచ్చి ప్రాంతానికి చెందిన అజిత్‌కుమార్‌. ఇతని వాహనం నెలరోజుల క్రితం ప్రమాధానికి గురైంది. ఈ సంఘటనపై ఊత్తుకోట పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. ఈక్రమంలో వాహనాన్ని విడిపించాలని పోలీసులను అజిత్‌కుమార్‌ కోరాడు. అయితే వాహనాన్ని విడిపించడానికి రూ.10వేలు ఇవ్వాలని ఎస్‌ఎస్‌ఐ భాస్కరన్‌, డీటీపీ ఆపరేటర్‌ సుకుమార్‌ డిమాండ్‌ చేశారు. అయితే లంచం ఇవ్వడానికి నిరాకరించిన అజిత్‌కుమార్‌ తిరువళ్లూరు ఏసీబీ పోలీసులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం సాయంత్రం రూ.10వేలను ఇస్తున్న సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ గణేషన్‌ నేతృత్వంలోని ఏసీబీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

గంజాయి కేసులో

ఒకరు..

అన్నానగర్‌: రైలులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెస్ట్రన్‌ జోన్‌ జాయింట్‌ కమిషనర్‌ దిశా మిట్టల్‌ ఆదేశాల మేరకు, అన్నానగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ బాలసుబ్రమణియన్‌ నేతృత్వంలోని మద్య నిషేధ పోలీసులు గురువారం సాయంత్రం పెరంబూరు రైల్వేస్టేషన్‌న్‌లో రహస్యంగా నిఘా ఉంచారు. ఆ సమయంలో, ఒక యువకుడు రెండు బ్యాగులతో రైలు దిగాడు. పోలీసుల అనుమానించి అతన్ని పట్టుకుని బ్యాగులను తనిఖీ చేశారు. అందుతో గంజాయి ఉన్నట్టు గుర్తించి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో ఒడిశాలోని మణిపాల్‌కు చెందిన ష్మికాంత్‌నాథ్‌ (32) అని, ఇతను ఒడిశా నుంచి చైన్నెకి గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలిసింది.అతని నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, అతన్ని ఎగ్మూర్‌ కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

స్నేహితుడిపై దాడి కేసులో ఒకరు..

తిరువొత్తియూరు: చోరీ చేసిన వాహనం కోసం స్నేహితుడిపై దాడి చేసిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె, ఐనావరం, నెహ్రూజ్యోతినగర్‌కు చెందిన లత (55) కుమారుడు శ్రీరామ్‌ కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఓటేరి నమ్మాళ్వార్‌ పేట, సుబ్బరాయన్‌ 4వ వీధికి చెందిన పార్థిబన్‌ (23) అనే తన స్నేహితుడితో కలిసి బైక్‌పై లత ఇంటికి వచ్చి శ్రీరామ్‌ను లేపి, తాను దొంగిలించిన సెల్‌ఫోన్‌ను విక్రయించి ఇవ్వమని కోరాడు. అలాగే ఇంతముందు ఇచ్చి ఉన్న చోరీ చేసిన వాహనాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు శ్రీరామ్‌, సెల్‌ఫోన్‌న్‌ను విక్రయించలేనని పార్థిబన్‌ చోరీ చేసిన వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన పార్థిబన్‌, దాచి ఉంచిన కత్తితో శ్రీరామ్‌పై దాడి చేశాడు. అంతేకాకుండా, అక్కడ నిలబడి ఉన్న శ్రీరామ్‌ ద్విచక్ర వాహనానికి పెట్రోల్‌ పోసి, నిప్పంటించి పారిపోయాడు. దీనిపై ఫిర్యాదు మేరకు ఓటేరి పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం ఉదయం పార్థిబన్‌ను అరెస్టు చేశారు.

ఆర్పీఎఫ్‌పై యువకుడి దాడి

తిరువొత్తియూరు: రైల్వే భద్రతా దళం పోలీసుపై దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె, ప్యారిస్‌ ప్రాంతానికి చెందిన వినయ్‌ ఆర్పీఎఫ్‌గా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఒక కేసు విచారణ నిమిత్తం ప్యారిస్‌ లోని బర్మాబజార్‌ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న తిరువొత్తియూరుకు చెందిన చంద్రు అనే యువకు డు వినయ్‌తో గొడవపడి దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు నార్త్‌బీచ్‌ పోలీస్‌స్టేషన్‌న్‌ పోలీసులు కేసు నమోదు చేసి చంద్రును శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు.

అరెస్టయిన ఎస్‌ఐ భాస్కరన్‌, సుకుమార్‌

లంచం కేసులో ఇద్దరి అరెస్ట్‌ 
1
1/1

లంచం కేసులో ఇద్దరి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement