కొత్త తరగతి గదుల అప్పగింత
కొరుక్కుపేట: చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా, చైన్నెలోని ఆలపాక్కంలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు కొత్తగా నిర్మించిన మూడు తరగతి గదులను వాణిజ్య అండ్ ప్రభుత్వ రంగ సంస్థలకు సేవలందిస్తున్న గ్లోబల్ కన్సల్టింగ్ టెక్నాలజీ, గైడ్‌హౌస్ సంస్థ పాఠశాల నిర్వాహకులకు అప్పగించింది. ఈ కార్యక్రమంలో గైడ్‌హౌస్ సీనియర్ నాయకులు జాన్‌సాద్, గైడ్‌హౌస్ ఇండియా భాగస్వామి, కంట్రీ హెడ్ మహేంద్ర రావత్, గైడ్‌హౌస్ భాగస్వామి వినయ్‌సింగ్, జస్వంత్ బంగేరా, నవీన్‌కుమార్, బాలచందీరన్, సాజి జచారియా, శివశంకరి శంకరన్, అరుల్ సాజిన్ తదితరులు పాల్గొని కొత్త తరగతి గదులను అప్పగించారు. ఈ. మూడు కొత్త తరగతి గదులు విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరచడానికి, విద్యాభివృద్ధికి సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించడానికి రూపొందించినట్లు గైడ్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు.


