
మోసం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
తిరువళ్లూరు: జంతువులకు ఉపయోగించే మందులను ఇండియాలో విక్రయించడానికి ఏజెన్సీతో పాటూ మందులను సరఫరా చేస్తామని నమ్మించి సుమారు రూ.34.86 లక్షలు మోసం చేసిన నైజీరియాకు చెందిన వ్యక్తికి మూడేళ్ల జైలు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. టోక్యో, నైజీరియా తదితర రెండు దేశాల్లో వెటిస్ అనిమల్ హెల్త్ టోగో అనే సంస్థ జంతువులకు ఉపయోగించే మందులను తయారు చేస్తూ వేర్వేరు దేశాలల్లో విక్రయిస్తూవుంది. ఈ సంస్థల ప్రతినిధిగా ఇండియాలో నైజీరియాకు చెందిన జాన్ విల్సన్ పని చేస్తున్నాడు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా మందులను విక్రయించడానికి ఏజెన్సీలు కావాలని వాటాప్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారాన్ని నమ్మి చోళవరం ప్రాంతానికి చెందిన జగదీషన్ ఫోన్‌లో జాన్ విల్సన్‌ను సంప్రదించి చైన్నె తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు ఇతర జిల్లాలకు ఏజెన్సీ కావాలని కోరినట్టు తెలుస్తుంది. ఏజెన్సీ, మందుల సరఫరా కోసం ముందుగా డబ్బులు చెల్లించాలని విల్సన్ కోరడంతో గత 2022లో విడతల వారిగా విల్సన్ బ్యాంకు ఖాతాలకు 34.86 లక్షల మేరకు చెల్లించాడు. అయితే మందులు సరఫరా చేయకపోవడంతో పాటూ ఏజెన్సీ ఇవ్వలేదు. మోసపోయామని ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాధితుడు ఆవడి పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని ఆవడి పోలీసులు విచారణ చేపట్టి గతంలో అరెస్టు చేశారు. కేసు విచారణ పూందమల్లి కోర్టులో సాగింది. విచారణ ముగిసిన క్రమంలో న్యాయ మూర్తి తీర్పును వెలువరిస్తూ నైజీరియాకు చెందిన వ్యక్తికి మూడేళ్ల జైలు విక్షను విధించారు. అనంతరం నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు.