
నటుడు మదన్ బాబు కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ నటుడు, సంగీత దర్శకుడు మదన్ బాబు (71) శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆరంభకాలంలో దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ నటించిన పలు నాటకాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా పలు టీవీ సీరియళ్లలో నటించారు. పలు టీవీ కార్యక్రమాల్లో జడ్జ్ గానూ వ్యవహరించారు.తమిళంలో పలు చిత్రాల్లో అనేక రకాల పాత్రలు పోషించి పాపులర్ అయ్యారు. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించిన మదన్ బాబు కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా వైద్య చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మదన్‌బాబుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా ప్రస్తుతం మదన్‌బాబు భౌతిక కాయాన్ని స్థానిక అడయార్‌లోని స్వగృహంలో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.
ఎన్నికల ప్రక్రియను
ప్రారంభించండి
–ఆలిండియా బార్ కౌన్సిల్ సూచన
కొరుక్కుపేట: ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమంత్రో సేన్, అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్‌ల కార్యదర్శులకు ఒక లేఖ రాశారు. లేఖలో ప్రాథమికంగా, ఎన్నికల్లో న్యాయవాదులు రాజ్యాంగం, అఖిల భారత బార్ కౌన్సిల్ నియమాల ద్వారా నిర్వహించబడతారు. నిర్వహించని రాష్ట్ర బార్ కౌన్సిల్‌లకు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించాలి. బార్ కౌన్సిల్‌లో నమోదు చేసు కున్న మొత్తం న్యాయవాదుల సంఖ్య, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎంత మంది న్యాయవాదులు ఉన్నారు. హాజరైన న్యాయవాదుల సంఖ్య, ధ్రువీకరణ పెండింగ్‌లో ఉన్న న్యాయవాదుల సంఖ్య, ఓటు వేయడానికి అర్హత ఉన్న న్యాయవాదుల సంఖ్యతో సహా వివరాలను వెంటనే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్‌కు పంపాలి. ఓటరు జాబితా చట్టపరమైన చర్యలు సహా ప్రాథమిక చర్యలు వెంటనే తీసుకోవాలి. న్యాయవాదుల చట్టం ప్రకారం, రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యనిర్వాహకుల పదవీకాలం 5 ఏళ్లు. వారు ఆరు నెలల పొడిగింపు పొందవచ్చు. అందువల్ల, పదవీకాలం ముగిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు, బార్ కౌన్సిల్‌ల క్షేత్ర పరిస్థితుల ఆధారంగా ఎన్నికల ప్రకటనను త్వరగా జారీ చేయాలి. దీనికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆగస్టు 10వ తేదీలోపు అఖిల భారత బార్ కౌన్సిల్‌కు పంపాలి ఈ విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.
నగల దుకాణంలో చోరీ
–మహిళ అరెస్ట్
తిరుత్తణి: నగల దుకాణంలో వినూత్న రీతిలో నగలు చోరీ చేసిన మహిళలను తిరుత్తణి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తిరుత్తణి మపోసీ రోడ్డులో ప్రకాష్ అనే వ్యక్తి నగల దుకాణం నడుపుతున్నాడు. శుక్రవారం సాయంత్రం రద్దీ సమయంలో ఓ మహిళ దుకాణానికి వెళ్లి నగలు కొనాలని గాజులు, రింగులు చూపాలని చెప్పడంతో దుకాణ సిబ్బంది చూపారు. నగలు చూసి నచ్చలేదని చెప్పి వెళ్లిపోయారు. అనుమానించిన దుకాణ యజమాని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాడు. వినూత్న రీతిలో మూడు సవర్ల నగలు చోరీ చేసినట్టు గుర్తించారు. ఫిర్యాదు మేరకు తిరుత్తణి సీఐ మదియరసన్ కేసు నమోదు చేసి దుకాణంలోని ఫుటేజ్ సాయంతో చైన్నెకి చెందిన ప్రియాంక(36) అనే మహిళలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
మద్యం మత్తులో వీరంగం
పళ్లిపట్టు: ఉపాధి పనులకు వెళుతున్న వృద్ధురాలిపై మద్యం మత్తులో దాడిచేసి లైంగికదాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నొచ్చిలి తోటి కాలనీకి చెందిన వృద్ధురాలు(60) శుక్రవారం ఉదయం టీసీ కండ్రిగలో ఉపాధి కూలీ పనులకు వెళ్లింది. మార్గమధ్యలో టీసీ కండ్రిగ గ్రామానికి చెందిన మూర్తి(45) మద్యం మత్తులో వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు విని గ్రామస్తులు వృద్ధురాలిని కాపాడి మందుబాబును చిదకబాది పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ వృద్ధురాలు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.