కండక్టర్‌పై విద్యార్థి దాడి
తిరుత్తణి: ప్రభుత్వ బస్సు కండక్టర్‌పై పాఠశాల విద్యార్థి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తిరుత్తణిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణంతో పాటు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. దీంతో బస్సు లు నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం తిరుత్తణి బస్టాండ్ నుంచి వీరమంగళం పయనించిన రూట్ నంబర్ 65 ప్రభుత్వ టౌన్ బస్సులో పయనించిన పాఠశాల విద్యార్థులు కొందరు ఫుట్‌బోర్డులో నిలుచుకుని ప్రయాణం చేశారు. లోపలికి రావాలని కండక్టర్ అజిత్(27) విద్యార్థులను హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కండక్టర్‌తో గొడవకు దిగారు. దీంతో ఆగ్రహం చెందిన ఒక విద్యార్థి కండక్టర్‌పై దాడి చేసి పరారయ్యాడు. దీంతో మురుగూరు వద్ద బస్సు ఆపి దాడి చేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని బస్సు కండక్టర్‌తో పాటు డ్రైవర్ డిమాండ్ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో తిరుత్తణి పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని విద్యార్థిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆందోళన విరమించారు. అర్ధగంట పాటు ఆలస్యంగా బస్సు బయలుదేరింది.
నాణ్యమైన వైద్యమే లక్ష్యం
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా వున్న పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించండమే లక్ష్యంగా సంక్షేమాన్ని కాపాడే స్టాలిన్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి నాజర్ తెలిపారు. సంక్షేమాన్ని కాపాడే స్టాలిన్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశిబిరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆవడిలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని రాష్ట్ర మంత్రి నాజర్ ప్రారంబించారు. మంత్రి నాజర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించాలన్న లక్ష్యంతోనే సంక్షేమాన్ని కాపాడే స్టాలిన్ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వైద్యశిబిరంలో ఆర్థో, హార్ట్, బీపీ, షుగర్, గైనకాలజిస్టు వైద్యనిపుణులతో పాటు ఈసీజీ, ఎకో సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. మొదట తిరువళ్లూరు జిల్లాలోని 14 యూనియన్‌లలో మూడు గ్రామాల చొప్పున 45 ప్రాంతాల్లో ప్రతివారం వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు దురైచంద్రశేఖర్, కృష్ణస్వామి, మేయర్ సూర్యకమార్, కమిషనర్ శరణ్య, డిప్యూటీ డైరెక్టర్‌లు ప్రియారాజ్, ప్రభాకరన్ పాల్గొన్నారు.
కారు దగ్ధం
తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని జాతీయ రహదారిలో పయనిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. పాస్టర్లు సహా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. చైన్నెలోని సీఎస్‌ఐ చర్చి పాస్టర్లు జయశీలన్, ధనశేఖర్ శనివారం ఆంధ్రాలోని నగరి సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొనేందుకు కారులో బయలుదేరారు. కారును సూశై అనే వ్యక్తి నడిపాడు, తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద కారు వెళుతుండగా కారు ఇంజిన్ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ పాస్టర్లను వెంటనే దింపి కారును రోడ్డుకు పక్కగా ఆపారు. కొంతసేపటికే కారు దగ్ధమైంది. సమాచారం మేరకు తిరుత్తణి అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన ప్రాంతం చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు దగ్ధమైంది.
తలపై కొబ్బరికాయలు కొట్టడం నిషేధం
తిరువొత్తియూరు: భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టే విధానాన్ని దేవదాయశాఖ నిషేధించింది. కరూరు జిల్లాలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆడి పెరుక్కు తర్వాత రోజున భక్తులు తలపై కొబ్బరికాయలు పగలగొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. వందలాది మంది భక్తులు ఈ విధంగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సంవత్సరం ఆడి పేరుక్కు ఉత్సవాలు నేడు ఆది పెరుక్కు పండుగను జరుపుకుంటారు. ఈక్రమంలో కృష్ణరాయపురం తాలూకా కార్యాలయంలో పెరుక్కు పండుగ సందర్భంగా అధికారులతో సమావేశం జరిగింది. ఇందులో మహాధనపురం మహాలత్ సుమి అమ్మ న్ ఆలయంలో జరిగే ఆడిపెరుక్కు సందర్భంగా, భక్తులు తలపై కొబ్బరికాయలు పగులగొట్టి మొక్కులు తీర్చుకునే విధానాన్ని దేవదాయశాఖ నిషేధం విధించింది.
క్లుప్తంగా
క్లుప్తంగా