
ఘనంగా వల్విల్ ఓరి ఉత్సవం
సేలం: నామక్కల్ జిల్లాలోని కొల్లిమలైలోని సెమ్మెడులోన వల్విల్ ఓరి ఘనంగా ప్రారంభించారు. కొల్లిమలైలోని వాసలూర్పట్టి బొటానికల్ గార్డెన్‌లో శనివారం జరిగింది. నామక్కల్ రెవెన్యూ కమిషనర్ వి.శాంతి నేతృత్వంలో సెందమంగళం ఎమ్మెల్యే పొన్నుసామి కొల్లిమలైలో ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన మందిరాలను ఆయన ప్రారంభించి పరిశీలించారు. అనంతరం పడవ ప్రయాణాన్ని ప్రారంభించారు. పుష్ప ప్రదర్శనలో గుర్రం, జింక ఆకారం, వివిధ రంగుల పూలతో చేసిన ప్రేమ చిహ్నం, కూరగాయలతో ఎలుగుబంటి, పక్షి బొమ్మలు, ధాన్యాలతో చేసిన జంతువులు, పండ్లతో చేసిన ముఖ్యమంత్రి విగ్రహం పర్యాటకులను ఆకట్టుకున్నాయి.

ఘనంగా వల్విల్ ఓరి ఉత్సవం