
ధర్మం ఉన్న చోటే ఈశ్వరుడు
కొరుక్కుపేట: ధర్మం ఎక్కడ ఉంటుందో ఈశ్వర భగవానుడు కూడా అక్కడే ఉంటారని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. భారతీయతా వాహిని– చైన్నె ఆధ్వర్యంలో భక్తి –ముక్తి పేరిట బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రెండు రోజుల ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు శనివారం సాయంత్రం చైన్నె, చేట్‌పేటలోని కుచలాంబాల్ కల్యాణ్‌ణ మహల్‌లో ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు పీవీఆర్ కృష్ణారావుతోపాటు టీటీడీ చైన్నె మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీకృష్ణ సత్కరించారు. ప్రవచన కార్యక్రమంలో భక్తి–ముక్తిపై చాగంటి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. మహాభారతంలోని ఘట్టాలను వివరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. విష్ణువు సర్వాంతర్యామి అని అన్నారు. భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వారి వెంటే ఈశ్వర భగవానుడు ఉంటారని ఉపదేశించారు. ఈశ్వర ప్రీతి కలిగిన వారికి అంతా మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అజంతా డాక్టర్ కే. శంకరరావు, ఆనంద్ కుమార్‌రెడ్డి, రంగారెడ్డి, అశోక్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు