
తంగ మగన్ జాయ్ ఆత్మకథ ఆవిష్కరణ
చైన్నె, సాక్షి : గ్లోబల్ బిజినెస్ ఐకాన్ , జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జాయ్ అలుక్కాస్ తన ఆత్మకథ తమిళ ఎడిషన్‌ను ‘తంగ మగన్ జాయ్‘ పేరుతో తీర్చిదిద్దారు. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని సినీ నటీ నటులు, ప్రముఖులు చైన్నెలో ఆవిష్కరించారు. వివరాలు.. ’తంగ మగన్ జాయ్’ పుస్తకంలో డాక్టర్ జాయ్ అలుక్కాస్ కేరళలో తన నిరాడంబర జీవితం నుంచి ప్రపంచంలో అతిపెద్ద , అత్యంత విశ్వసనీయ ఆభరణాల రిటైల్ సామ్రాజ్యాలలో ఒకదానికి నాయకత్వం వహించే వరకు చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని వివరించారు. ఇది దార్శనికత, స్థితిస్థాపకత అవిశ్రాంత కృషివలుడు కథ. జోయలుక్కాస్ విజయగాథలో కీలక పాత్ర పోషించిన తమిళనాడు ప్రజల కోసం దీనిని తమిళంలో విడుదల చేశారు. ఈ స్ఫూర్తిదాయకమైన కథనాన్ని తరతరాలుగా తమిళం పాఠకుల హృదయాలకు దగ్గరగా తీసుకురావడంలో ఈ ఆవిష్కరణ ఒక ముఖ్యమైనదిగా ప్రకటించారు. ఈ ఆవిష్కరణ సభలో డాక్టర్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ, తమ కలను నమ్మి, మాతో పాటు ఈ మార్గంలో నడిచిన ప్రతి శ్రేయోభిలాషికి, కస్టమర్లకు భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పుస్తకావిష్కరణ వేడుకకు వ్యాపార, సినిమా , సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు పాల్గొని డాక్టర్ జాయ్ అలుక్కాస్ సేవలను కొనియాడారు. తంగ మగన్ జాయ్ పుస్తకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక దుకాణాలలో , ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో నటీనటులు నాజర్, పార్తీబన్, భాగ్యరాజ్ , ప్రశాంత్, మీనా, దేవయాని తదితరులు హాజరయ్యారు.