
విశాల్ 35వ చిత్రం ప్రారంభం
తమిళసినిమా: ఎదగడానికై నా, ఎదిగిన తరువాత అయినా ప్రచారం ముఖ్యంగా మారిన రోజులివి. అలాంటి ప్రచారంలో ఉన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనే చెప్పవచ్చు. ఎందుకంటే వరలక్ష్మీ నటించిన పాత్రలు అలాంటివి. 2012లో పోడాపోడీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె శరత్‌కుమార్ వారసురాలు అన్నది తెలిసిందే. అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా, అలాంటి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతినాయకిగానూ నటించడమే ఈమె ప్రత్యేకత. అలా ఎలాంటి పాత్రకై నా రెడీ అనే వరలక్ష్మీ బహుభాషా నటి కూడా. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. కారణాలేమైన ఇప్పుడీమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారనే చెప్పవచ్చు. అందులో భాగంగా శ్రీలంకకు వెళ్లి ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. శ్రీలంకలో చిన్నమోన్ లైఫ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ ప్రాంతంలో ఈమె ఫొటో షూట్ నిర్వహించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ఫొటోల్లో తనకే సొంతమైన అందంతో పాటు ధైర్యాన్ని వ్యక్తం చేసేలా వరలక్ష్మీ కనిపించడం విశేషం. పలు చిత్రాల్లో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న వరలక్ష్మీ ఇటీవల నటించిన ది వెర్డిక్ట్ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలను అందుకున్నారు. డేరింగ్ అండ్ డైనమిక్ నటిగా ముద్ర వేసుకున్న ఈ భామ మరిన్ని వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా వరలక్ష్మీ ఫొటో సెషన్ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
తమిళసినిమా: నటుడు విశాల్ ఇటీవల మార్క్ ఆంటోని, మదగజరాజా చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే త్వరలో ఓ ఇంటివాడు కూడా కాబోతున్నారు. నటి ఽసాయి దన్సికను జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నారు. ఇలాంటి సంతోషకరమైన తరుణంలో విశాల్ తన 35వ చిత్రానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత నిర్మించడం విశేషం. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 99వ చిత్రం కావడం మరో విశేషం. ఇంతకు ముందు ఎందరో నూతన నటీనటులకు, సాంకేతిక వర్గానికి అవకాశాలు కల్పించి, వారి సినీ జీవితాలకు మంచి బాట వేసిన నిర్మాత ఆర్‌బీ.చౌదరి తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి రవిఅరసు కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గత నెలలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను శుక్రవారం ప్రారంభించారు. చిత్రం షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్‌లో 45 రోజుల్లో చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేయనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం, రిజర్డ్ ఎం.నాథన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా నటి దుషారా విజయన్ నాయకిగా నటిస్తున్న ఇందులో తంబిరామయ్య, ఆర్జై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.
శ్రీలంకలో
వరలక్ష్మి
ఫొటో సెషన్

విశాల్ 35వ చిత్రం ప్రారంభం

విశాల్ 35వ చిత్రం ప్రారంభం