
క్లుప్తంగా
అడ్డంకులు వచ్చినా
ఎదుర్కోవాలి
వేలూరు: విద్యార్థులు జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిగా మారాలని చైన్నె అన్నాయూనివర్సిటీ నానో టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ టి.దేవసేన అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాలలో 66వ స్నాతకోత్సవ కార్యక్రమం కళాశాల కార్యదర్శి డాక్టర్ ఆరోగ్యమేరి జోసిపిన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై వివిధ కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసిన 879 మందికి డిగ్రీ, 241 మందికి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలను అందజేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేసేందుకే బ్రిటీష్ వారి కాలంలోనే అగ్జిలియమ్ కళాశాలను ప్రారంభించారన్నారు. క్రమశిక్షణతో ఉంటే మాత్రమే ఉన్నత శిఖరాలకు వెళ్లగలమన్నారు. డిగ్రీలు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు ఆశక్తి చూపాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టిర్ ఆరోగ్య జయశీలి, వైస్ ప్రిన్సిపల్ అమల వలర్‌మది, ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ డీన్ విన్సీ, ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కలైసెల్వి, విద్యార్థినిలు, ఫ్రొఫెసర్‌లు పాల్గొన్నారు.
పుట్టినరోజునే
కానరాని లోకాలకు..
–ట్యాంకర్ ఢీకొని ఎస్‌ఐ దుర్మరణం
అన్నానగర్: పుట్టినరోజే ఓ ఎస్‌ఐ తుదిశ్వాస విడిచాడు. ట్యాంకర్ ఢీకొని ఓ ఎస్‌ఐ దుర్మరణం చెందాడు. కీరనూరుకు చెందిన ముత్తుకుమార్ (52) పుదుక్కోట్టై జిల్లా కీరనూర్ పోలీస్‌స్టేషన్‌న్‌లో ఎస్‌ఐ. శనివారం తన పుట్టినరోజున స్వస్థలమైన వెల్లనూర్ సమీపంలోని వడచేరి పట్టిలో ఉన్న తల్లిని చూడడానికి పుదుక్కోట్టై నుంచి బైక్‌లో బయలుదేరాడు. నెడుంచేరి ప్రాంతంలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్యాంకర్ బైక్‌ను ఢీకొంది. ఈఘటన తీవ్రంగా గాయపడిన ముత్తుకుమార్‌ను స్థానికులు తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన నామక్కల్ జిల్లా మోహనూర్‌కు చెందిన ట్యాంకర్ డ్రైవర్ కృష్ణసామిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలేజీ రోడ్డుకు
నటుడు జయశంకర్ పేరు
తమిళసినిమా: స్థానిక నుంగంబాక్కంలో పాపులర్ అయిన వీధి పేరు కాలేజీ రోడ్డు. కాగా అదే రోడ్డులో ప్రముఖ దివంగత నటుడు మక్కల్ కలైంజర్ జయశంకర్ ఇల్లు ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో చిరస్మరణీయమైన నటుడు జయశంకర్. తమిళ జేమ్స్‌బాండ్‌గా పేరు గాంచిన ఈయన తనదైన నటనతో తమిళ ప్రేక్షకుల మన్ననలను పొందారు. అలా తమిళ సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించినందుకు గానూ కాలేజీ రోడ్డుకు మక్కల్ కలైంజర్ జయశంకర్ రోడ్డుగా పేరు మార్చినట్లు చైన్నె మహానగరం శాఖ పేర్కొంది. దీని గురించి చైన్నె మహానగరం జాయింట్ డైరెక్టర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో స్థానిక నుంగంబాక్కంలోని కాలేజ్ రోడ్డులో నటుడు జయశంకర్ ఇల్లు ఉండడంతో ఆ రోడ్డుకు ఇప్పుడు మక్కల్ కలైంజర్ జయశంకర్ రోడ్డుగా ప్రభుత్వం అనుమతితో పేరు మార్చినట్లు పేర్కొన్నారు.
పథకాన్ని విజయవంతం చేయాలి
వేలూరు: మీతో ముఖ్యమంత్రి పథకం విజయవంతం కావడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరు డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈనెల 7న కరుణానిధి ఏడవ వర్ధంతి పురష్కరించుకుని ఆయన విగ్రహాలకు నివాళులర్పించాలన్నారు. అదేవిధంగా తమిళనాడులో డీఎంకే పార్టీలో రెండు కోట్ల మందికి సభ్యత్వం ఇప్పించి పార్టీ విజయం సాధించేందుకు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌లకు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు. మీతో స్టాలిన్ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల వినతి పత్రాల కేంద్రం ఏర్పాటు చేసి పథకం విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. అనంతరం వివిధ సమస్యలపై సమీక్షించించి తీర్మానం చేశారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, మాజీ ఎంపీ మహ్మద్‌సఖీ, యూనియన్ కార్యదర్శలు జ్ఞానశేఖరన్, శరవణన్, గజేంద్రన్, కరుణాకరన్, తనికాచలం పాల్గొన్నారు.

క్లుప్తంగా

క్లుప్తంగా