
రిటైర్ పోలీస్ అధికారులకు సత్కారం
కొరుక్కుపేట: చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ శాఖలో 24 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ మేరకు చైన్నె వేపేరిలోని చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో చైన్నె నగర పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ పాల్గొని చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ శాఖలో 25 సంవత్సరాలకు పైగా సేవలందించినందుకు 24 మందిని ఘనంగా సత్కరించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు కమిషనర్ విజయేంద్ర బిదారి,, డిప్యూటీ కమిషనర్లు డి.ఎన్.హరికిరణ్ ప్రసాద్, జి.సుబ్బులక్ష్మి, పోలీసు అధికారులు, ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు అధికారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.