
రూ. 3 వేల కోట్లకు చేరిన జాన్సన్ టర్నోవర్
● సెంగాడులో రూ.250 కోట్లతో విస్తరణ పనులు
సాక్షి,చైన్నె: ఇళ్లకు, కంపెనీలకు, ప్రభుత్వ రైల్వే ప్రాజెక్టులకు లిఫ్టులు, ఎస్కలేటర్లను తయారు చేయడంలో పేరుగాంచిన జాన్సన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ సంస్థ టర్నోవర్ రూ.3వేల కోట్లకు చేరిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి. జగన్నాథన్ తెలిపారు. దీంతో సెంగాడు వద్దనున్న కర్మాగారంలో రూ.250 కోట్లతో విస్తరణ కార్యకలాపాలను చేపడుతున్నట్టు ఆయన మంగళవారం చైన్నెలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలోప్రకటించారు. ఆయన మాట్లాడుతూ పూందమల్లి, ఒరగడం, సెంగాడులోను, నోయిడా వద్ద సంస్థ కర్మాగారాలున్నాయన్నారు. జాన్సన్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ సంస్థకు దేశవ్యాప్తంగా 80 బ్రాంచ్‌లు ఉన్నాయని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన తూత్తుకుడి ఎయిర్ పోర్టులోనూ తమ సంస్థ లిఫ్ట్‌ల సదుపాయాన్ని కల్పించిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంస్థ జనరల్ మేనేజర్ శివకుమార్, డైరెక్టర్ యోహాన్ కే జాన్ పాల్గొన్నారు.