
చైన్నెలో టామరిండ్ టేల్స్
సాక్షి, చైన్నె: దక్షిణ భారత శాఖాహార వంటకాల రుచికరమైన అనుభవాన్ని అందించే టామరిండ్ టేల్స్ చైన్నె తేనాంపేటలోని సెనాటఫ్రోడ్డులో తమ హోటల్‌ను ప్రారంభించింది. వివరాలను బుధవారం జరిగిన ప్రారంభోత్సవం అనంతరం నిర్వాహకులు సోనాక్షి, కిరణ్ మాట్లాడుతూ శాఖాహారప్రియులను ఆకర్షించే విధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రత్యేక రుచులను అందించనున్నట్టు వెల్లడించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్ అందుబాటులో ఉంటుందని అలాగే కాఫీ అండ్ స్నాక్స్ కౌంటర్ సైతం ఉంటుందని తెలిపారు.