
వెబ్ ప్రపంచంలోకి రేవతి
తమిళసినిమా: నటిగా రేవతి ప్రతిభ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఈమెలో మంచి దర్శకురాలు ఉన్నారన్నది తెలిసిందే. ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో రేవతి దర్శకత్వం వహించిన చిత్రాలు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా ఈమె వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. రేవతి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన గుడ్ వైఫ్ అనే వెబ్ సీరీస్ త్వరలో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. ఇందులో మరో జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ప్రధానపాత్రను పోషించడం విశేషం. నటుడు సంపత్‌రాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సీరీస్ ఇంతకుముందు హిందీలో రూపొందిన ది ట్రయల్ ప్యార్ కనూన్ దోఖా పేరుతో రూపొందిన వెబ్ సీరీస్‌కు రీమేక్ కావడం గమనార్హం. హిందీలో కాజోల్ నటించారు. ఇది జియో హాట్ స్టార్ ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షక ఆదరణను పొందింది. కాగా గుడ్‌వైఫ్ ద్వారా దర్శకురాలిగా వెబ్ ప్రపంచంలోకి ప్రవేశించిన రేవతి తన భావాన్ని తెలుపుతూ ఈ వెబ్ సీరీస్ హిందీలో సక్సెస్ కావడంతో తమిళంలో దర్శకత్వం వహించే అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో కథానాయకి పాత్ర చాలా బలమైందన్నారు. ప్రియమణి, సంపత్‌రాజ్‌తో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. జియో హాట్‌స్టార్, బణిజో ఆసియా సంస్థలతో కలిసి వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని రేవతి పేర్కొన్నారు.