
● ‘సమర్తక్’ షిప్
భారత నావికా దళం కోసం చైన్నె శివారులో ఉన్న కాట్టుపల్లి ఎల్ అండ్ టీ షిప్ యార్డ్‌లో మల్టీ పర్పస్ వెసెల్ ప్రాజెక్టుగా తొలి షిప్‌ను సిద్ధం చేశారు. సమర్తక్ పేరిట శ్రీఆత్మనిర్భర్ భారత్‌శ్రీ, శ్రీమేక్ ఇన్ ఇండియాశ్రీ చొరవతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ షిప్‌ను సోమవారం ఆవిష్కరించారు.
ఈ నౌకను ఎన్‌డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు శశిత్రిపాఠి, నేవల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి ప్రారంభించారు. వివిధ స్వదేశీ ఆయుధాలు, సెన్సార్లు, ఆధునిక హంగులతో 106 మీటర్ల పొడవు, 16.8 మీటర్ల వెడల్పుతో ఈనౌక రూపుదిద్దుకుంది.
– సాక్షి,చైన్నె