30న కరాటే కిడ్‌: లెజెండ్స్‌ | - | Sakshi
Sakshi News home page

30న కరాటే కిడ్‌: లెజెండ్స్‌

May 26 2025 12:18 AM | Updated on May 26 2025 12:18 AM

30న కరాటే కిడ్‌: లెజెండ్స్‌

30న కరాటే కిడ్‌: లెజెండ్స్‌

తమిళసినిమా: హాలీవుడ్‌ చిత్రాలకు భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి, ఆదరణ ఉంటుంది. అలా ఇంతకుముందు వచ్చిన కరాటే కిడ్‌ 5 ఫ్రాంచైజ్‌ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆలరించాయి. తాజాగా ఆ కోవలో వస్తున్న చిత్రం కరాటే కిడ్‌: లెజెండ్స్‌. ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇందులో డేనియల్‌ లారుస్స గా ప్రధాన పాత్రను పోషించిన రాల్ఫ్‌ మాచియో తన భావాలను పంచుకుంటూ కరాటే కిడ్‌: లెజెండ్స్‌ చిత్రంలో మరోసారి లారుస్సో పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో జాకీచాన్‌, మిస్టర్‌ హాన్‌లతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఒక నటుడుగా, ఎంటర్‌టైనర్‌గా జాకీచాన్‌ పట్ల తనకు ఎంతో గౌరవం అన్నారు. ఈ రంగంలో ఆయన ఒక లెజెండ్‌ అని, చిత్రాల్లో మార్షల్‌ ఆర్ట్స్‌, కామెడీ సన్నివేశాల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. అదే విధంగా మిస్టర్‌ మియాగి అంటే కూడా తనకు చాలా గౌరవం అని రాల్ఫ్‌ మాచియో చెప్పారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లిష్‌ ,తమిళం, తెలుగు భాషల్లో 30వ తేదీన తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement