
ఆక్రమణల కూల్చివేత
తిరుత్తణి: రోడ్డుకు అడ్డంగా వున్న మరుగుదొడ్లను రెవెన్యూ శాఖ అధికారులు శనివారం తొలగించారు. తిరుత్తణి మున్సిపల్ పరిధిలోని కుమరన్‌నగర్‌లో 300కు పైగా కుటుంబాలు నివాసముంటున్నారు. ఆ ప్రాంతంకు సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలన్న స్థానికుల కోర్కె మేరకు ఎమ్మెల్యే నియోజకవర్గ నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయించారు. అయితే సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు రోడ్డుకు మధ్యలో ప్రయివేటు వ్యక్తి నిర్మించిన మరుగుదొడ్లు అడ్డురావడంతో తొలగించాలని కోరారు. అయితే ప్రయివేటు వ్యక్తి అంగీకరించకపోవడంతో ఆర్డీఓకు స్థానికులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు సర్పే చేపి ఆక్రమిత మరుగుదొడ్లను జేసీబీతో తొలగించారు. సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు సమస్య పరిష్కారం కావడంతో కుమరన్ నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.8