
అన్నాడీఎంకే పథకాలపై కరపత్రాలు
పళ్లిపట్టు: అన్నాడీఎంకే పాలనలో అమలు చేసిన పథకాలుపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ఆదివారం ఆ పార్టీ శ్రేణులు అవగాహన కల్పించారు. అన్నాడీఎంకే పాలనలో అమలు చేసిన పథకాలను డీఎంకే ప్రభుత్వం రద్దు చేసి, సామాన్యుల జీవితాలతోపాటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తూ అన్నాడీఎంకే పాలనలో అమలు చేసిన పథకాలు పట్ల అవగాహన కల్పించే విధంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పళ్లిపట్టు టౌన్ అన్నాడీఎంకే కన్వీనర్ జయవేలు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు, వాహన ఛోదకులు, ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీ హరి పాల్గొని కరపత్రాలు అందజేశారు. పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రభుత్వం అమ లు చేసిన పథకాలను డీఎంకే ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల వివాహ కానుక రద్దు చేసినట్లు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పశువుల పంపిణీ పథకం రద్దు చేసినట్లు డీఎంకే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రజలు అన్నాడీఎంకే పాలన వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మండల అన్నాడీఎంకే కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, శ్రేణులు కన్నయ్య, పళని, పెరుమాళ్ పాల్గొన్నారు.