ఔరా.. పెంపుడు శునకంకు బేబీ షవర్‌ | - | Sakshi
Sakshi News home page

ఔరా.. పెంపుడు శునకంకు బేబీ షవర్‌

May 27 2025 1:56 AM | Updated on May 27 2025 1:56 AM

ఔరా.. పెంపుడు శునకంకు బేబీ షవర్‌

ఔరా.. పెంపుడు శునకంకు బేబీ షవర్‌

అన్నానగర్‌: చెంగల్‌పట్టు జిల్లా కల్పక్కం సమీపం కూవత్తూరు ప్రాంతానికి చెందిన భరణి (62), కుమారి (58) దంపతులు. వీరికి కామేష్‌, సిబిరాజన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భరణి, కుమారికి రియా అనే ఆడ శునకం ఉంది. వారు దానిని ప్రేమగా పెంచారు. ప్రస్తుతం గర్భవతి అయిన తమ కుక్కకు బేబీ షవర్‌ ఏర్పాటు చేసి జరుపుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. సోమవారం వారు శునకం ను ఒక కాటన్‌ పరుపు మీద కూర్చోబెట్టి, పట్టు చీర కట్టి, దండ వేసి, దానిని సంతోషంగా ఉంచడానికి ఒక హారం ధరింపజేశారు. అక్కడికి వచ్చిన సీ్త్రలకు తమలపాకులు మరియు జామ పండ్లతో తాబూలం ఇచ్చారు. కుమారి తమ్ముడు కార్తీక్‌ కుక్కకు దండ వేసి, మేనమామ చేసే ఆచారాలు నిర్వహించి సంతోషపడ్డారు. ఆచారం పూర్తి చేసిన తర్వాత, గర్భిణీ కుక్కకు బిస్కెట్లు, బిర్యానీ ఇచ్చారు. తరువాత భరణి, వేడుకకు వచ్చిన స్నేహితులు మరియు బంధువులకు బిర్యానీ విందును ఏర్పాటు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement