
విల్ చిత్ర టీజర్ విడుదల
తమిళసినిమా: నటుడు విక్రాంత్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం విల్. అలేఖ్య, పదం వేణుకుమార్, మోహన్ రామన్, లొల్లుసభ స్వామినాథన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఫుట్‌స్టెప్స్ ప్రొడక్షన్స్, కొత్తారి మెడ్రాస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఎస్.శివరామన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం న్యాయస్థానం నేపధ్యంలో సాగే విభిన్న కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. తాను 25 ఏళ్ల పాటు న్యాయవాదిగా బాధ్యతలను నిర్వహించినట్లు చెప్పారు. దీంతదో న్యాయస్థాఽనం గురించి, దాని విధి విధానాల గురించి యధార్ధంగా తెరపై ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వాక్‌స్వాతంత్య్రం గురించి వివరించనున్నట్లు చెప్పారు. ఒకరు తన ఆస్తులను చట్టబద్ధంగా ఎలా కాపాడుకోవాలి వంటి పలు విషయాలను చర్చించినట్లు చెప్పారు. కాగా దీనికి నటి సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్ సంగీతాన్ని అందించడం విశేషం. టీఎస్.ప్రసన్న ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. దీన్ని నటుడు అరుణ్ విజయ్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందనే ఆనందాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, ఒక పాటను విడుదల చేయగా సామాజిక మాధ్యమాలో వైరల్ అవుతూ మంచి ఆదరణను పొందుతున్నాయని చెప్పారు.
నటి సోనియా అగర్వాల్‌కు సూచనలు ఇస్తున్న దర్శకుడు ఎస్.శివరామన్