ప్రేమ పెళ్లి వద్దని తాళి తీసిన యువతి | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి వద్దని తాళి తీసిన యువతి

May 25 2023 7:44 AM | Updated on May 25 2023 8:14 AM

- - Sakshi

అన్నానగర్‌: తిరుపూర్‌ పూండి రింగ్‌రోడ్‌కు చెందిన యువతి (23). ఈమెకి ఆరు నెలల ముందు కోయంబత్తూర్‌ జిల్లా అన్నూర్‌ ఒటర్‌పాళయంకు చెందిన 29 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలిసి పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో గత 17వ తేదీ యువతి తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో ఐదున్నర సవర్ల నగలు, రూ.5 లక్షల నగదు తీసుకుని వెళ్లింది.

తల్లిదండ్రులు వెలంపాళయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఇంటి నుంచి అన్నూర్‌కి వెళ్లి ప్రియుడిని కలుసుకుంది. అనంతరం అక్కడే గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. భద్రత కల్పించాలని ప్రేమికులు ఇద్దరు అన్నూరు పోలీసులను ఆశ్రయించారు. అన్నూర్‌ పోలీసులు ప్రేమ జంటను వెలంపాళయం పోలీస్‌స్టేషన్‌ కు పంపారు. అక్కడ పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

దీంతో వారు స్టేషన్‌న్‌కు చేరుకుని కుమార్తెను చూసి బోరున విలపించారు. యువతి మనసు మారి తల్లిదండ్రులతో వెళుతూ ప్రియుడిని తప్పులేదని చెప్పి తాళి తీసి అతనికి ఇచ్చి వెళ్లింది. పోలీసులు యువకుడికి సర్ది చెప్పి పంపించేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement