జీవితంపై విరక్తి చెంది ఎస్‌ఐ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తి చెంది ఎస్‌ఐ ఆత్మహత్య

Apr 17 2023 2:00 AM | Updated on Apr 17 2023 7:33 AM

- - Sakshi

భోజనం తరువాత తన గదిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం 8 ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో

తిరువళ్లూరు: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఓ ఎస్‌ఐ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు బైపాస్‌రోడ్డు ప్రాంతానికి చెందిన తనిగవేలు(49). తిరువళ్లూరు పరిధిలో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య గీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతను కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం యథావిధిగా విధులకు హాజరై శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. భోజనం తరువాత తన గదిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం 8 ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో భార్య గీత తలుపు తెరిచి చూడగా ఉరి వేసుకుని శవంగా కనిపించాడు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement