చిలుకూరు : ఎస్‌ఏ–1 జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా చేయాలని డీఈఓ చావా శ్రీనివాస్ సూచించారు. సోమవారం చిలుకూరు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 9వ తరగతి ఫిజికల్ సైన్స్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మొదటి సారి 9వ తరగతి పరీక్షల జవాబు పత్రాలను మండల స్థాయిలో ఒకే చోట మూల్యాంకనం చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల విద్యార్థుల సామర్థ్యాలు తెలుస్తాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పరిశీలించారు. పనులు తిరిగే ప్రారంభమయ్యేలా చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఎంఈఓ ఎన్‌జి. శివకుమారి, పాఠశాల హెచ్‌ఎం రాజారాం, ఉపాధ్యాయులు ఉన్నారు.


