సూర్యాపేట (భానుపురి) : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రజావాణికి జిల్లాస్థాయి అధికారులు హాజరు కావాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 86 దరఖాస్తులు వచ్చి నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.


