న్యూస్‌రీల్
జల్సాల కోసం దొంగతనాలు
జల్సాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
- 8లో
సూర్యాపేట : దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి కారణమైన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేసి న్యాయ విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్థులు మల్లు నాగా ర్జున్‌రెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, టీజేఎస్ జిల్లా నాయకుడు కుంట్ల ధర్మార్జున్లు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జ్ఞానేష్‌కుమార్‌ను అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల చోరీకి పాల్పడిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు జ్ఞానేష్‌కుమార్ నిర్ణయాలను వ్యతి రేకించినప్పటికీ ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొన్నారన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ లబ్ధి పొందాలనే ఆలోచనతో సర్ ప్రక్రియను ప్రవేశపెట్టి పేద, బడుగు బలహీన వర్గాలతో పాటు ముస్లిం మైనార్టీల ఓట్లను తొలగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, డేవిడ్‌కుమార్, శివకుమార్, వెంకన్న, శ్రీనివాస్, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.


