సూర్యాపేటటౌన్ : ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించి, సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఎస్పీ పాల్గొని వినతులు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అవసరమైన సేవలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు.
శివయ్యకు అన్నాభిషేకం
మేళ్లచెరువు: మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాస పూర్వక ఏకా దశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహా లింగార్చన, అన్నాభిషేకం, పుష్పార్చన, గోపూజ చేపట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి యోగా
పోటీలకు ఎంపిక
సూర్యాపేట(ఆత్మకూర్(ఎస్) : రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఆత్మకూరు ఎస్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు ఎంపికై నట్లు హెచ్‌ఎం వి.శ్రవణ్‌కుమార్ తెలిపారు. నల్లగొండలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి యోగా పోటీల్లో ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన జి.వైష్ణవి, జి.రేణు పాల్గొని ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థినులతో పాటు పీడీ శ్రీదేవిని పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.


