నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన

Oct 6 2026 2:18 AM | Updated on Oct 6 2026 2:18 AM

మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లాలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పర్యటించనున్నట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. సోమవారం చింతలపాలెం మండలం పులిచింతల హైడ్రోపవర్‌ ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మంత్రులు ముందుగా పులిచింతల హైడ్రో పవర్‌ ప్రాజెక్టు సమీపంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారని, ప్రాజెక్టును సందర్శించిన అనంతరం జెన్‌కో, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులను పరిశీలిస్తారని, మునగాల మండలం ఎస్‌ఎంపేట వద్ద రూ. 9.60కోట్లతో నిర్మించనున్న ఆధునిక కమ్యూనిటీ కిచెన్‌కు భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట హుజూర్‌నగర్‌, కోదాడ ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, జెన్‌కో ఎస్‌ఈ దేశ్యానాయక్‌, తహసీల్దార్‌ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, తదితరులు ఉన్నారు.

ఫ కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఏర్పాట్లను

పరిశీలించిన కలెక్టర్‌, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement