సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ రైలు వెళ్లాల్సిందే | - | Sakshi
Sakshi News home page

సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ రైలు వెళ్లాల్సిందే

Oct 6 2026 2:18 AM | Updated on Oct 6 2026 2:18 AM

సూర్యాపేట : శంషాబాద్‌ నుంచి చైన్నె బుల్లెట్‌ రైలు అలైన్‌న్‌మెంట్‌ను సూర్యాపేట మీదుగానే ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 53వ రోజు కొనసాగాయి. దీక్షల్లో పాల్గొన్న వారికి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మొదట ప్రతిపాదించిన అలైన్‌న్‌మెంట్‌ సూర్యాపేట స్టేషన్‌ మీదుగానే ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిపాదనలను మార్చిందని విమర్శించారు. బుల్లెట్‌ రైలు విషయమై త్వరలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జుట్టుకొండ సత్యనారాయణ, మైనా రిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండీ.అబీద్‌, చల్లమల్ల నరసింహ, కర్నాటి కిషన్‌, వీరేందర్‌, మల్సూర్‌గౌడ్‌, తాళ్లపల్లి మధు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement