రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌పై నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక శిక్షణ శనివారం ముగిసింది. కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ విభాగాల ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్, ఐబీఎం సంయుక్తంగా ఈ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐబీఎం ప్రాజెక్టు మేనేజర్ సాయి రాఘవేంద్ర, శిక్షకురాలు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ఏఐ టూల్స్ సహాయంతో ఉద్యోగాలు సాధించేలా ప్రాజెక్టులను సిద్ధం చేసుకోవడం, ప్రతిభను చాటేలా రెజ్యుమ్ డిజైన్ చేయడం, రోజువారీ విద్యలో చాట్ జీపీటీ, జెమిని ఏఐలను నైపుణ్యంతో ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో సాంకేతిక రంగానికి కృత్రిమ మేధస్సే కీలకమని, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో ఫిజిక్స్ హెచ్‌ఓడీ శ్రీనివాస్‌రెడ్డి, కంప్యూటర్ సైన్ హెచ్‌ఓడీ ఎస్‌పి.వెంకటరమణ, అధ్యాపకులు పాల్గొన్నారు.


