నడిగూడెం: ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను సద్విని యోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధి కారి సులోచనా రాణి విద్యార్థులకు సూచించా రు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన యూని ఫామ్ ను శనివారం నడిగూడెంలోని కేఎల్‌ఎన్ ప్రభు త్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు, షూస్, బెల్టులు, గుర్తింపు కార్డులతో పాటు బ్యాగులను అందిస్తుందని తెలిపారు. త్వరలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి.విజయానాయక్, అధ్యాపకులు జాన్ పాషా, కృష్ణ, మహేష్, ఈశ్వర్, నాగరాజు, శ్రీనివాసరావు, కోళ్లు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, తేజశ్రీ, రజిత, సుజాత పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ
క్షేత్రం సందర్శన
నడిగూడెం : ఆంద్రప్రదేఽశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా, నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన బయో రిసోర్స్ సెంటర్ (బీఆర్‌సీ)ని సూర్యాపేట జిల్లాకు చెందిన 55 మంది రైతులు సందర్శించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించే అవకాశం కల్పించేందుకు క్షేత్ర సందర్శన నిర్వహించినట్లు తెలిపారు. డీపీఎం అమల కుమారి, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త అరిగెల కిరణ్ రైతులకు వివిధ రకాల కషాయాలు, ప్రకృతి వ్యవసాయ ద్రావణాల తయారీ విధానాలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు బి. ముత్యం, ఎం.ఉమేష్, రైతులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహునికి నిత్యపూజలు
మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం అర్చకులు స్వామివారికి విశేష పూజలు, నిత్యకల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి అర్చనలు, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ, అర్చకులు పాల్గొన్నారు.


