భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సీజన్‌న్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 352 ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించగా, 267 కేంద్రాలను మొదటి దశలో ప్రారంభించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కేంద్రాల్లో మౌలిక వసతులు, తూకం, నాణ్యత పరీక్ష, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, హమాలీలు, రవాణా, నిల్వ తదితర ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. రైతులకు టోకెన్ల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని, రవాణా కాంట్రాక్టర్లు, అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, జిల్లా పౌరసరఫరాల అధికారి వి. మోహన్‌న్‌బాబు, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ వి. శ్రీధర్‌రెడ్డి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్ కుమార్, జిల్లా సహకార సూపరింటెండెంట్ కె.అంజయ్య పాల్గొన్నారు.
కేంద్రీకృత వంటశాలకు స్థల పరిశీలన
మునగాల : మండలంలోని వెంకట్రాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్‌ఎంపేట రెవెన్యూ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న కేంద్రీకృత వంట శాల నిర్మాణం కోసం స్థలాన్ని శనివారం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహ పరిశీలించారు. స్థల అనుకూలత, అందుబాటులో ఉన్న విస్తీర్ణం, నిర్మాణానికి అనువైన అవసరమైన సౌకర్యాలను ఆర్డీఓ సూర్యనారాయణ, స్థానిక తహసీల్దార్ వి.సరితను అడిగి తెలుసుకున్నారు.
ఫ రైతులకు ఇబ్బందులు
కలగకుండా ఏర్పాట్లు
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


