నాలుగు తరాలుగా కాంగ్రెస్‌కు విధేయులం | - | Sakshi
Sakshi News home page

నాలుగు తరాలుగా కాంగ్రెస్‌కు విధేయులం

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

అర్వపల్లి: ఏఐసీసీ సభ్యుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి అర్వపల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తమ ఇలవేల్పు అయిన అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు తరాలుగా విధేయులుగా ఉందన్నారు. తాను ఎమ్మెల్సీ బరిలో ఉన్నానని, కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవంగా తన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసిందని చెప్పారు. తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వంపై ఎలాంటి గందరగోళం, అసంతృప్తి లేదని, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తమ కుటుంబం ఎప్పుడూ ధిక్కరించలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలతో తమ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని తెలిపారు. తన తండ్రి దామోదర్‌రెడ్డి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని, ఆయన కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పట్టభద్రులంతా ఓటుహక్కు నమోదు చేసుకోవాలని, ఇందుకోసం ప్రతి గ్రామంలో హెల్ప్‌డెస్క్‌లను ప్రారంభిస్తామని ప్రకటించారు. అనంతరం ఆలయం నుంచి మెయిన్‌రోడ్డు వరకు ర్యాలీగా వెళ్లి వైజంక్షన్‌లో ఉన్న ఆర్డీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్‌ చైర్మన్‌ షఫీఉల్లా, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు దూరూరి యోగానందచార్యులు, పోతు భాస్కర్‌, చకిలం రాజేశ్వరరావు, తిరుమలప్రగడ అనూరాధ, డీసీసీ ఉపాధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మోరపాక సత్యం, డాక్టర్‌ ఊర రామ్మూర్తి, బైరబోయిన సైదులు, మహరాజు, సతీష్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్సీ అభ్యర్ధి సర్వోత్తమ్‌రెడ్డి

ఫ అర్వపల్లి నుంచి ఎమ్మెల్సీ

ప్రచారానికి శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement