తండ్రి బాటలోనే తనయుడు | - | Sakshi
Sakshi News home page

తండ్రి బాటలోనే తనయుడు

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

తండ్రి బాటలోనే తనయుడు

మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం నుంచే ప్రారంభించే వారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రచారం మొదలు పెట్టడం ఆయన సెంటిమెంట్‌. దానిని సర్వోత్తమ్‌రెడ్డి కూడా పాటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పార్టీ అధిష్టానం ప్రకటించిన అనంతరం ఆయన శనివారం అర్వపల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తన తండ్రి ఆర్డీఆర్‌ సెంటిమెంట్‌ ప్రకారం తాను కూడా అర్వపల్లి ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు సర్వోత్తమ్‌రెడ్డి తెలిపారు. అర్వపల్లి దేవాలయానికి తమ కుటుంబం 850 ఎకరాల భూమిని దానం చేసినట్లు గుర్తుచేశారు. ఎడారిగా మారిన ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తెచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత ఆర్డీఆర్‌కే దక్కిందన్నార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement