బీపీ, షుగర్‌ హై | - | Sakshi
Sakshi News home page

బీపీ, షుగర్‌ హై

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

న్యూస్‌రీల్‌

చిట్టీల పేరుతో..
చిట్టీల పేరుతో రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రభుత్వ టీచర్‌, అతడి భార్యను అరెస్టు చేశారు.

తేనీరు.. తీరొక్క పేరు

ఒకప్పుడు సింగిల్‌ చాయ్‌ లభించే

మన టీ కొట్లు ఇప్పుడు తీరొక్క రుచులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి.

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

- 8లో

అలవాటు మారింది.. అనారోగ్యం దరిచేరింది

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆధునిక జీవన విధానంలో ప్రజలు ఎక్కువ మొత్తంలో అధిక బరువు, స్థూలకాయం, బీపీ, షుగర్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. ఆహారం, జంక్‌ ఫుడ్‌, ఇతర అలవాట్లు ప్రజల అనారోగ్యానికి కారణం అవుతోంది. స్థూలకాయం సమస్య మహిళల్లో అధికంగా పెరుగుతుండగా, పురుషులు ఎక్కువ మంది బీపీ, షుగర్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే –6 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాల్లో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయని పేర్కొంది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితులను వెల్లడించింది.

స్థూలకాయంతో బాధ

పడుతున్న మహిళలే ఎక్కువ

● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అధిక బరువు (స్థూలకాయం) సమస్యతో బాధపడుతున్న మహిళలు సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 44.4 శాతం మంది ఉండగా, నల్లగొండ జిల్లాలో 38.9 శాతం మంది, యాదాద్రి జిల్లాలో 34.4 శాతం మంది ఉన్నట్లు తేలింది.

● రక్తపోటుతో (బీపీ) బాధపడుతున్న పురుషులు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నారు. అక్కడ 35.3 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నట్లు తేలింది. సూర్యాపేటలో 30.9 శాతం మంది, నల్లగొండలో 24.5 శాతం మంది బీపీతో బాధపడుతున్న వారు ఉన్నారు.

● మహిళల్లో నల్లగొండలో 22.8 శాతం, సూర్యాపేటలో 26.3 శాతం, యాదాద్రిలో 26.1 మంది హైబీపీతో బాధపడుతున్నారు.

సూర్యాపేటలో ఎక్కువ మందికి షుగర్‌

● షుగర్‌ వ్యాధి బారిన పడిన వారు సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు. పురుషుల్లో సూర్యాపేటలో 28.8 శాతం మంది షుగర్‌ బారిన పడ్డారు. ఇక యాదాద్రి జిల్లాలో 24.6 శాతం మంది, నల్లగొండలో 26 శాతం మంది వీటి బారిన పడ్డారు.

● మహిళల్లో నల్లగొండలో 22.8 శాతం మంది, సూర్యాపేటలో 26.3 శాతం మంది, యాదాద్రిలో 26.1 శాతం మంది షుగర్‌ బారిన పడ్డారు.

నల్లగొండ, యాదాద్రిలో మందుబాబులు ఎక్కువే

మత్తు పదార్థాల వాడకం విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో 15 ఏళ్లకు పైబడిన వారిలో సగానికి పైగా మందుబాబులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 54.1 శాతం మంది, నల్లగొండలో 50.4 శాతం మంది, సూర్యాపేటలో 46.5 శాతం మద్యం తాగే వారు ఉన్నారు.

● పొగాకు వాడకంలో నల్లగొండలో పురుషులు 24.7 శాతం మంది ఉండగా, సూర్యాపేటలో 18 శాతం, యాదాద్రిలో 14.5 శాతం మంది పొగరాయుళ్లు ఉన్నట్లు తేలింది.

బాల్య వివాహాలు,

యుక్త వయస్సులో గర్భధారణ

బాల్య వివాహాల విషయంలో నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నల్లగొండ జిల్లాలో (20–24 ఏళ్ల మహిళల్లో) 25.2 శాతం మంది 18 ఏళ్ల కంటే ముందే వివాహం చేసుకున్నారు. సూర్యాపేటలో ఇది 17.2 శాతం కాగా, యాదాద్రి భువనగిరిలో చాలా తక్కువగా 11.3 శాతమే నమోదైంది. 15–19 ఏళ్లలోనే గర్భం దాల్చిన వారు నల్లగొండ 10.6 శాతం మంది ఉండగా, సూర్యాపేటలో 9.4 శాతం మంది, యాదాద్రి జిల్లాలో 4.7 శాతం మాత్రమే ఉన్నారు.

పిల్లల్లో పోషకాహార లోపం

పిల్లల్లో పోషకాహార లోపం అధికంగానే ఉంది. పోషకాహార లోపంతో ఐదేళ్లలోపు పిల్లల్లో వయస్సుకు తగిన ఎత్తు పెరగని పిల్లలు నల్లగొండ జిల్లాలో 26.2 శాతం మంది ఉన్నారు. సూర్యాపేటలో అత్యధికంగా 29.2 శాతం మంది ఉండగా, యాదాద్రి జిల్లాలో 23.6 శాతం ఉన్నారు. ఐదేళ్లలోపు వయస్సుకు తగిన బరువు లేని పిల్లలు అధికంగానే ఉన్నారు. నల్లగొండలో 29 శాతం మంది ఉండగా, సూర్యాపేటలో 25.9 శాతం, యాదాద్రి జిల్లాలో 31 శాతం మంది ఉన్నట్లు తేలింది.

అధిక బీపీ ఉన్న పురుషులు, మహిళల శాతం

జిల్లా పురుషులు మహిళలు

యాదాద్రి 35.3 26.1

సూర్యాపేట 30.9 26.3

నల్లగొండ 24.5 22.8

అధిక షుగర్‌ ఉన్న పురుషులు, మహిళల శాతం

జిల్లా పురుషులు మహిళలు

సూర్యాపేట 28.8 26.3

యాదాద్రి 24.6 26.1

నల్లగొండ 26 22.8

స్థూలకాయంతో బాధపడుతున్న మహిళల శాతం

సూర్యాపేట 44.4

నల్లగొండ 38.9

యాదాద్రి 34.4

ఫ మహిళలను వేధిస్తున్న స్థూలకాయం సమస్య

ఫ 60శాతం ప్రసవాలు సిజేరియన్ల ద్వారానే..

ఫ ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం

జాతీయ కుటుంబ

ఆరోగ్య సర్వే–6లో వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement