‘సర్‌’లో బీఎల్‌ఏల పాత్రే కీలకం | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో బీఎల్‌ఏల పాత్రే కీలకం

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

అర్వపల్లి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ బీఎల్‌ఏలు కీలకంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. అర్వపల్లిలో సోమవారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, బీఆర్‌ఎఎస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ ఆధ్యక్షతన జరిగిన సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జగదీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడటానికి బీఎల్‌ఏలు జాగ్రత్తగా పనిచేయాలని కోరారు. గోదావరి జలాల విడుదల, యూరియా పంపిణీ, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కలయికలో వచ్చిన హైబ్రీడ్‌ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు హెలికాప్టర్‌ మంత్రులుగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ సర్‌ పట్ల బీఆర్‌ఎస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్‌, కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికయుగేంధర్‌రావు, నేవూరి ధర్మేందర్‌రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్‌ చైర్మన్‌ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, మన్నె రేణుక, రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్‌, బొడ్డు రామలింగయ్య, పందిరి యుగేంధర్‌, వివిధ మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement