
రేపు ఉమ్మడి జిల్లా చెస్ ఎంపిక పోటీలు
సూర్యాపేట : సూర్యాపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం ఉమ్మడి జిల్లా అండర్–13 బాలబాలికలకు చెస్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గండూరి కృపాకర్, ఎల్.సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గెలుపొందిన వారిని హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. పోటీలకు వచ్చే విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామనితెలిపారు. పూర్తి వివరాలకు సెల్: 9394753343 నంబర్ సంప్రదించాలని కోరారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
పేట మార్కెట్ కార్యదర్శిగా ఫసియుద్దీన్
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ నూతన కార్యదర్శిగా ఎండి ఫసియుద్దీన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సంతోష్ కుమార్ బదిలీ కాగా ఆయన స్థానంలో వికారాబాద్ మార్కెట్ కార్యదర్శిగా పనిచేస్తున్న పసియుద్దీన్ సూర్యాపేటకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : సదరం సర్టిఫికెట్ కలిగి ఉండి జూలై 2025లో గడువు ముగిసిన వారంతా దగ్గరలోని మీసేవా కేంద్రం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే స్వయంగా పీడబ్ల్యూడీ లాగిన్‌లో రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు మేసెజ్ ద్వారా క్యాంపు నిర్వహించే తేదీ తెలపనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కొత్తగా యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్టేషన్ చేసుకునే వారు ఎప్పుడైనా మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వీరికి కూడా సీరియల్ నంబర్ ఆధారంగా క్యాంపు తేదీని నిర్ణయించి మేసెజ్ పంపనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
చివ్వెంల : ప్రజా పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.ప్రదీప్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండలం కుడకుడలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ ఎన్నికల సమావేశానికి హాజరై మాట్లాడారు. అనంతరం జిల్లా కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హుజూర్‌నగర్‌కు చెందిన వాసా కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా తుంగతుర్తికి చెందిన వేల్పుల పరశురామ్, ఉపాధ్యక్షుడిగా సూర్యాపేటకు చెందిన కట్టా రమేష్, కోశాధికారిగా చివ్వెంలకు చెందిన పాల్వాయి రవి, సహాయ కార్యదర్శిగా మోతెకు చెందిన వడకాల మహేష్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యా రు. సమావేశంలో కర్ణాకర్, పరశురామ్, రమేష్, మహేష్, రవి, అర్జున్, సైదులు, వెంకన్న, నాగుల్‌మీరా, భవన్ కుమార్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

రేపు ఉమ్మడి జిల్లా చెస్ ఎంపిక పోటీలు