
ఉద్యానవనం.. ఆ నివాసం
రామగిరి(నల్లగొండ): పర్యావరణానికి మేలు కలిగేలా మొక్కలను పెంచుతున్నారు నల్లగొండ పట్టణానికి చెందిన వంగూరి భాస్కర్. ఆయన వృతిపరంగా ప్రభుత్వ ఉద్యోగి. 30 సంవత్సరాలుగా తన ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను పెంచుతూ ఇంటిని ఉద్యానవనంగా మార్చారు. ఇంట్లో ఖాళీ స్థలం అంటూ కనిపించదు. దాదాపు 200 పైగా మొక్కలు పెంచుతున్నారు. అందులో కొన్ని ఔషధ మొక్కలు, ఎయిర్ ఫ్రెషనర్స్, పూల మొక్కలు, అరుదైన జాతుల మొక్కలు ఉన్నాయి. పర్యావరణానికి మేలు జరిగేలా మొక్కలు పెంచుతూ నలుగురికి స్ఫూర్తినిస్తున్నారు.
మొక్కల పెంపకంతో మానసిక ప్రశాంతత
మొక్కల పెంపకంతో మానసిక ప్రశాంతంగా లభిస్తుంది. చుట్టూ చెట్లు ఉంటే అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. రోజు ఉదయం పూట కాసేపు చెట్లకు నీరు పోయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. సోషల్ మీడియాతో గడిపి సమయం వృథా చేయకుండా మొక్కలు పెంచితే మనకూ పర్యావరణానికి మేలు జరుగుతుంది. – వంగూరు భాస్కర్, నల్లగొండ