
అత్యాశకు పోయి ఆర్థికంగా నష్టపోవద్దు
సూర్యాపేటటౌన్ : ప్రజలు అత్యాశకు పోయి ఆర్థికంగా నష్టపోవద్దని ఎస్పీ కె.నరసింహ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుత సమాజంలో సాంకేతికత బాగా అభివృద్ధి చెందిందని, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ తో కూడిన అత్యాధునిక మొబైల్స్ అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశను, అవసరాలను, అవగాహన లోపాన్ని అవకాశంగా చేసుకుని కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దోచేస్తున్నారని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్‌ను ఉపయోగించి ప్రముఖ వ్యక్తులు, ప్రజా ఆదరణ పొందిన వ్యక్తుల నకిలీ వీడియోలు సృష్టించి సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆర్థిక మోసాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ వీడియోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్ , పబ్లిక్ యాప్‌లాంటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సీఎం సభకు పటిష్ట బందోబస్తు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈ నెల 14న తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం తిరుమలగిరిలో సీఎం సభా స్థలిని ఎస్పీ పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, హెలిపాడ్, రోడ్డు మార్గాలు, గ్యాలరీలు, సభా ప్రాంగణం వద్ద రక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నర్సింహాచారి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ