
బా్యగ్.. బరువు
నడుంనొప్పి వచ్చే అవకాశం
విద్యార్థి మోయలేనంత బరువుతో వెన్నెముక, నడుము నొప్పివంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో వీపు మీద పెట్టుకునే బ్యాగులనే ప్రోత్సహిస్తున్నారు. ఇలా బరువులు మోయడం ద్వారా చదువుపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. బలహీనంగా ఉన్న పిల్లలకు మరింత ఇబ్బందులు ఎదురవుతాయి.
– డాక్టర్ చంద్రశేఖర్, పిల్లల వైద్య నిపుణులు
నిబంధనల ప్రకారం
పుస్తకాల బరువు ఉండాలి
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యార్థి పుస్తకాల బరువు ఉండాలి. నిబంధనలు అతిక్రమించి ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు తరగతుల వారీగా పుస్తకాల బరువు ఉండాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. –అశోక్, డీఈఓ
సూర్యాపేటటౌన్ : విద్యార్థులకు పుస్తకాల బ్యాగు భారంగా మారింది. కొందరు ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఐఐటీ, జేఈఈ ఇలా రకరకాల పేర్లతో పదుల సంఖ్యలో పుస్తకాలు అంటగట్టడం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు బండెడు పుస్తకాలతో బడికి వెళ్లాల్సివస్తోంది. లేత వయసులో శక్తికి మించి బరువు మోయడంతో వెన్ను పూస, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
308 ప్రైవేట్.. 950 ప్రభుత్వ పాఠశాలలు..
జిల్లాలో 308 ప్రైవేట్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇవే కాకుండా అనుమతి లేనివి సైతం ఉన్నాయి. వీటిలో సుమారు 40వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లోనే నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, ఇంకా రకరకాల పేర్లతో ఉన్న పుస్తకాలను విక్రయిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే తల్లిదండ్రుల తపను ఆసరా చేసుకొని ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరలు పెంచి వసూలు చేస్తూ ఎల్‌కేజీ విద్యార్థులకు కిలోల కొద్ది పుస్తకాలను అంటగడుతున్నారు. వాటిని బ్యాగ్‌లో వేసుకొని చిన్నారులు మోయలేని పరిస్థితులు ఉన్నాయి.
నో బ్యాగ్ డే ఏదీ?
కేంద్ర ప్రభుత్వం ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా ఆయా తరగతులకు పాఠ్యపుస్తకాలు ఎంత బరువు ఉండాలనే విషయంపై సూచనలు ఇచ్చింది. దీంతో పాటు తరగతుల వారీగా పుస్తకాల బరువుకు సంబంధించి రాష్ట్రంలోనూ విద్యాశాఖ అధికారులు 2017 జూలైలో జీఓను తీసుకొచ్చారు. అలాగే నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలని గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ రోజు విద్యార్థులు బ్యాగ్ లేకుండా పాఠశాలలకు రావాలని సూచించింది. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇవి ఏ పాఠశాలలోనూ అమలు కావడం లేదు.
సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ
విద్యార్థి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్
పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు సబ్జెక్టు పుస్తకాలు, ఐదు నోట్ పుస్తకాలు ఉండాలి. కానీ 12నోట్ పుస్తకాలు, ఆరు సబ్జెక్టు పుస్తకాలతో పాటు
అదనంగా వివిధ పేర్లతో మరో ఐదారు పుస్తకాలు ఇచ్చారు. అయితే ఇవి సుమారు 10కిలోల బరువు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏడో
తరగతికి పుస్తకాల బరువు 4కిలోలు ఉండాలి. ఇటీవల విద్యార్థికి వెన్ను నొప్పి, భుజాల నొప్పులు
రావడంతో ఆస్పత్రిలో చూపించినట్టు విద్యార్థి తండ్రి తెలిపాడు. ఇదీ.. జిల్లాలో ప్రైవేట్
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల
పరిస్థితికి నిదర్శనం.
విద్యార్థుల వీపుపై బండెడు పుస్తకాలు
ఫ ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా పుస్తకాలు
అంటగడుతున్న యాజమాన్యాలు
ఫ శక్తికి మించి పుస్తకాల
బరువుతో అవస్థలు
ఫ వెన్నుపూస సమస్యలు
వస్తాయంటున్న వైద్య నిపుణలు
నిబంధనల ప్రకారం తరగతుల వారీగా ఉండాల్సిన బ్యాగ్ బరువు..
తరగతులు బ్యాగ్ బరువు
(కిలోలలో..)
1-2 1-3
3-5 2-3
6-7 04
8 4-5
9-10 05

బా్యగ్.. బరువు

బా్యగ్.. బరువు