
మానసిక వికలాంగులకు చేయూతనందించాలి
చివ్వెంల(సూర్యాపేట) : మాససిక వికలాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ అన్నారు. గురువారం సూర్యాపేట మండలం కాసరబాద గ్రామ శివారులోని బధిరుల పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె.. మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకర బోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, ప్రిన్సిపల్ మదనాచారి పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార
సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్