
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
అర్వపల్లి: గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు తెలిపారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని గురువారం తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో 18 గ్రంథాలయాలు ఉండగా 15 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నట్లు చెప్పారు. మిగిలిన 3గ్రంథాలయాలకు భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. జాజిరెడ్డిగూడెం గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పాఠకులు వినతిపత్రం ఇవ్వగా స్పందించారు. ఈకార్యక్రమంలో లైబ్రేరియన్లు శ్యాంసుందర్‌రెడ్డి, ఎం. వెంకటరంగారావు, దార శ్రీనివాస్, సిబ్బంది కుంభం సోమయ్య, స్థానికులు బింగి కృష్ణమూర్తి, నరహరి, కె. నరేష్, నవీన్, ఉపేందర్, రాజు, మహేష్, శేఖర్ పాల్గొన్నారు.
భూగర్భ జలాలు పెంచడానికి పాటుపడాలి
నూతనకల్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూగర్భ జలాల పెంచడానికి పాటుపడాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. గురువారం నూతనకల్ మండలంఎడవెల్లిలో బోర్‌బావి రీచార్జిని పరిశీలించి మాట్లాడారు. వర్షపు నీటితో బోర్ బావుల రీచార్జితో మలినాలకు అడ్డుకట్టపడి స్వచ్ఛమైన నీరు లభిస్తుందన్నారు. ఆయన వెంట ఎంపీఓ శశికళ, పంచాయతీ కార్యదర్శి చలమయ్య ఉన్నారు.
హుజూర్‌నగర్‌కు
1,392వ ర్యాంకు
హుజూర్‌నగర్: స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25 సర్వేకు సంబంధించిన ర్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. శుభ్రత, పరిశుభ్రత, తడిపొడి చెత్త వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై కేంద్రం ఏటా సర్వే నిర్వహిస్తుంది. ఈ మున్సిపాలిటీలో 28 వార్డులుండగా ఆయా వార్డుల నుంచి 12, 500 మార్కులపై సర్వే నిర్వహించింది. ఇందులో జాతీయ స్థాయిలో 1,392, రాష్ట్ర స్థాయిలో 137వ ర్యాంకు సాధించింది. మున్సిపాలిటీలో డోర్ టు డోర్ చెత్త సేకరణలో 83 శాతం, మార్కెట్ ఏరియాలో 100 శాతం, తడి, పొడి చెత్త వేరు చేసే విధానంలో 0 శాతం, చెత్త ఉత్పత్తి, ప్రాసెసింగ్‌లో 54 శాతం పనితీరు కనబరిచినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే 2023–2004లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పోల్చుకుంటే ఈసారి కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది.

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి