
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభా స్థలిని అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 14న సీఎం చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని వెల్లడించారు. బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు సరిగా ఉండాలని పోలీసులకు సూచించారు. ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి నీటి వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, తహసీల్దార్ హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు