
మరికొన్ని కథనాలు 9లో
పచ్చని పొదరిల్లు
మొక్కలకు నీళ్లు పడుతున్న భాస్కర్
ఆత్మకూరు(ఎం): వివిధ రకాల మొక్కలతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ గృహం.. ఆత్మకూరు(ఎం)కు చెందిన సోలిపురం అరుణది. చిన్నప్పటి నుంచి ఆమెకు మొక్కల పెంపకం అలవాటుగా మారింది. ఆ.. అలవాటే తన ఇంటి ఆవరణను పూలు, పండ్లు, కూరగాయల చెట్లతో పార్కులా మార్చింది. భర్త సోలిపురం ఉపేందర్‌రెడ్డి ప్రోత్సాహంతో ఇంటి ఆవరణలో తీరొక్క మొక్కలు నాటింది. రోజూ చెట్లకు నీళ్లు పట్టడం, పాదులు చేయడం, మొక్క కత్తిరింపు పనులు స్వయంగా చేస్తుంది. తమది వ్యవసాయ కుటుంబం అని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజూ కనీసం గంట సమయమైనా మొక్కలు, చెట్ల సంరక్షణకు కేటాయిస్తానని అరుణ చెబుతుంది.
మోత్కూరు : మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన రక్షణ శాఖ మాజీ ఉద్యోగి బిల్లకంటి లక్ష్మీనారాయణ హరిత సేవలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ పొందిన లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి స్వగ్రామంలో ఉంటున్నాడు. ప్రకృతిపై ఉన్న మక్కువతో ఉద్యోగంలో ఉన్న సమయంలో తన క్వార్టర్స్ ఆవరణలో వివిధ రకాలు మొక్కలు పెంచి ఉన్నతాధికారులతో శభాష్ అనిపించుకున్నాడు. రిటైర్డ్ అయిన తరువాత అదే స్ఫూర్తితో స్వగ్రామంలో తన ఇంటి ఆవరణను నందనవనంగా మార్చేశాడు.
35 రకాల మొక్కలు
ఔషధ రకాలకు సంబంధించి మారేడు, తులసీ, పూదీన, పారిజాతం, ఉసిరి, కలబంద.. పండ్ల మొక్కలు జామ, మామిడి, బత్తాయి, దానిమ్మ, ఉసిరి, కొబ్బరి ఉన్నాయి. వీటితో పాటు రాధామాధవ్ క్రొటేన్స్, 8 రకాల గులాబీలు, మల్లెలో లిల్లి, గోరింటాకు, నల్లేరు, ఎర్ర, పచ్చ మందారం, తెల్ల, పసుపు, చామంతి, నిత్య మల్లెపూలు, తమలపాకు, గన్నేరు, బిల్ల గన్నేరు, నూరుహారాలు ఇలా రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి గేట్ పక్కన నాటిన తగజాతి పూలమొక్క పచ్చటి తోరణంలా ఆకర్షణీయంగా మారింది. మొక్కలను లక్ష్మీనారాయణ దంపతులు ప్రాణంగా చూసుకుంటారు.
ఇంటి ఆవరణను హరితవనంగా తీర్చిదిద్దిన రక్షణ శాఖ మాజీ ఉద్యోగి లక్ష్మీనారాయణ
దంపతులు
●

మరికొన్ని కథనాలు 9లో

మరికొన్ని కథనాలు 9లో