
ఎనిమిది కళాశాలల్లో 1,500 అడ్మిషన్లు
నేరేడుచర్ల : జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,500 అడ్మిషన్లు వచ్చాయని డీఐఈఓ భానునాయక్ అన్నారు. శుక్రవారం ఆయన నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై మాట్లాడుతూ ఒక్క నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 122 అడ్మిషన్లు అయ్యాయని, ఇంకా ఆడ్మిషన్లు పెంచేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. కొందరు పాఠాలను బోధిస్తుంటే మరికొందరు అధ్యాపకులు గ్రామాలను సందర్శించి విద్యార్థులను చేర్పించాలని సూచించారు. విద్యార్థుల టీసీలను తెప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట అధ్యాపకులు డాక్టర్ మద్దిమడుగు సైదులు, కేలెన్‌రావు, ప్రణతి, శ్రీనివాసులు, వెంకన్న, నరేందర్, నర్సింహాచారి, గణేష్, అంజయ్య, సునిత, వెన్నెల ప్రసాద్, వీరుఉ, అపర్ణ, వీరేష్ ఉన్నారు.
ఫ డీఐఈఓ భానునాయక్