
పోలీస్ ఆర్థిక చేయూత పథకంతో భరోసా
సూర్యాపేటటౌన్ : పోలీస్ ఆర్థిక చేయూత పథకం పోలీస్ కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ కృష్ణయ్య అనారోగ్యంతో ఇటీవల మరణించగా ఆయన కుటుంబానికి పోలీస్ చేయూత పథకం ద్వారా వచ్చిన రూ.2లక్షల చెక్కును ఎస్పీ.. మంగళవారం అందజేసి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. కృష్ణయ్య కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీదర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజు భార్గవి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్ పాల్గొన్నారు.
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి
సూర్యాపేట : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు లీగల్ సెల్ కృషి చేస్తుందని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీసీసీ లీగల్ సెల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అహర్నిశలు పాటుపడుతోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉమాశంకర్, రాష్ట్ర సెక్రటరీ మూమిన్ రోషన్, రాష్ట్ర కన్వీనర్ నిమ్మరబోయిన నవీన్, ఏ ఎల్‌యూ జిల్లా సెక్రటరీ సీనపల్లి సోమేశ్వర్, మారపాక వెంకన్న, షఫీ ఉల్లా, బత్తిని వెంకటేశ్వర్లు, ఈశ్వర్ కుమార్, టేకులపల్లి శ్రీనివాసరావు, దోరేపల్లి రమేష్, కోనం రఘురామయ్య, పసల బాలరాజు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్‌కు ఉత్తమ అవార్డు
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్రంలోనే మంచి ఫలితాలు సాధించడంతో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే నల్లగొండ డీసీసీబీని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శంకర్‌రావు, రవీందర్రావు, సురేంద్రమోహన్, ఉదయభాస్కర్ ఉన్నారు.
పెండింగ్ బిల్లులను చెల్లించాలి
సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాపర్తి రామనర్సయ్య, పుప్పాల వీరన్నలు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను సేకరించి మాట్లాడారు. సమావేశంలో శంకర్, కృష్ణమూర్తి, రాచూరి ప్రతాప్, నర్సయ్య, అంజయ్య, వెంకయ్య, శ్రీనివాస్‌రెడ్డి, డి.వెంకన్న పాల్గొన్నారు.

పోలీస్ ఆర్థిక చేయూత పథకంతో భరోసా

పోలీస్ ఆర్థిక చేయూత పథకంతో భరోసా

పోలీస్ ఆర్థిక చేయూత పథకంతో భరోసా