
పశుపోషకులకు అందుబాటులో ఉండాలి
కోదాడరూరల్ : పశుపోషకులకు పశు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో నియోజకవర్గ పశువైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలోని 11 ప్రాథమిక, 19 ఆరోగ్య ఉపకేంద్రాల నూతన భవనాలు, మర్మతులకు రూ.6కోట్ల నిధులను ఎస్టిమేట్ చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. అదేవిధంగా దశాబ్దకాలం కిందట రాష్ట్రం వ్యాప్తంగా నిలిచిపోయిన గొర్రెల పెంపెకందారులకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సహాకారంతో తిరిగి నియోజకవర్గంలో త్వరలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీక్షలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, ఆరోగ్య కేంద్రాల పశువైద్యులు పాల్గొన్నారు.
ఫ జిల్లా పశువైద్యాధికారి
డాక్టర్ శ్రీనివాసరావు