అవినీతి బీఆర్‌ఎస్‌ను గద్దెదించాలి | Sakshi
Sakshi News home page

అవినీతి బీఆర్‌ఎస్‌ను గద్దెదించాలి

Published Wed, Nov 15 2023 1:28 AM

రఘునాథపాలెంలో నిర్వహించిన 
ర్యాలీలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  - Sakshi

మఠంపల్లి: రాష్ట్రంలో అవినీతి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఎంపీ, హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మఠంపల్లి మండలం మేజర్‌పంచాయతీ రఘునాథపాలెంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మాఘం నరసింహారావు, వార్డుసభ్యులు నవీన్‌, కోటేశ్వరమ్మలతో పాటు 25 కుటుంబాల వారు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కండువాలు కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేసిందని ఆరోపించారు. గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదని, 24 గంటల విద్యుత్‌ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టులు కట్టి కాలువలు తీసి సాగునీరందించామన్నారు. సాగునీరు సక్రమంగా అందని కిష్టపట్టె లాంటి టేలాండ్‌ ప్రాంతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా రూ.వేలాది కోట్లతో కృష్ణానదిపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి సాగునీరందించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భూక్యామంజీనాయక్‌, తిరుమలశెట్టి అప్పయ్య, డీవీ సుబ్బారావు, అల్లం ప్రభాకర్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, ఎంపీటీసీ చెన్నయ్య, మాజీ ఎంపీటీసీ సామేలు, పుల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, నాగులుమీరా, జమీల్‌, నిజాం, అప్పారావు, పకీర్‌ అహ్మద్‌, నరసింహారావు, అచ్చయ్య, సామ్యేల్‌, లక్ష్మయ్య, జోజి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఫ హుజూర్‌నగర్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement
 
Advertisement