శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

శ్రీకాకుళం

● జిల్లాలో ‘పుర’ పీఠాలు మహిళలకే

● రిజర్వేషన్లలో అన్నీ వారికే కేటాయింపు

● రిజర్వేషన్ల లెక్కలతో అంచనాలు

తలకిందులు

మహిళలకు రాజ్యాధికారంలో, రాజకీయ అధికారంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్‌ ఎట్టకేలకు సాకారం అవుతున్నది. వైఎస్సార్‌ సీపీ హయాంలో బీజం పడిన ఈ సంకల్పానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అనుసరించక తప్పలేదు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అప్పటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పార్టీపరంగాను, చట్టపరంగాను అత్యధిక సీట్లు కేటాయించి స్థానిక ప్రభుత్వాల్లో వారి భాగస్వామ్యం గణనీయంగా పెంచింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు ఖరారు చేసిన రిజర్వేషన్లలో మహిళలకు తగిన వాటా ఇవ్వకతప్ప లేదు. తాజా రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలో ఒక నగరపాలక సంస్థ మేయర్‌, మూడు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాలపై మహిళా నేతలు కొలువుతీరనున్నారు.

శ్రీకాకుళం కార్పొరేషన్‌ 2015లో ఏర్పాటైంది. ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. అంతకు ముందు మున్సిపాలిటీగా ఉండేది. శ్రీకాకుళం మున్సిపాలిటీ 1856లో ఏర్పాటైంది. బ్రిటీష్‌ ఇండియా పరిపాలన కాలంలో ఏర్పాటైన మున్సిపాల్టీగా, దేశంలో అత్యంత పురాతనమైన మున్సిపాలిటీగా రికార్డుల్లో నిలిచింది. రిజర్వేషన్‌ రొటేషన్‌లో భాగంగా 1981లో జనరల్‌కు రిజర్వు కాగా, 1995లో బీసీకి రిజర్వు అయింది. 2000, 2005 ఎన్నికల్లో జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. చివరిగా జరిగిన ఎన్నికలో ఎం.వి.పద్మావతి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి ఎన్నికలు జరగలేదు. కార్పొరేషన్‌ ఏర్పాటు కావడంతో విలీన పంచాయతీల వివాదం నేపథ్యంలో బంతి కోర్టులో ఉండిపోయింది. తాజాగా జరగనున్న ఎన్నికల్లో జనరల్‌ మహిళ రిజర్వేషన్‌ ఖరారైంది.

శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఇవి కొలిక్కివచ్చాక రిజర్వేషన్ల తుది జాబితా వెల్లడిస్తారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మున్సిపల్‌ రిజర్వేషన్లు వచ్చేశాయి. పట్టణాలకు, నగరానికి ఎన్నికల సందడిని తెచ్చేశాయి. జిల్లాలోని కార్పొరేషన్‌కు, మూడు మున్సిపాల్టీలకు మహిళా రిజర్వేషన్లే ఖరారయ్యాయి. పురపాలక, నగరపాలక సంస్థల పీఠాలను అతివలే అధిరోహించనున్నారు. ఇందులో ప్రధానమైన శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. దీంతో అందరి దృష్టి కార్పొరేషన్‌పై పడింది. ఎవరా మహిళా? ఎవరికా అదృష్టం? అనే దానిపై చర్చ మొదలైంది. మిగతా మూడు మున్సిపాల్టీలు కూడా మహిళల ఖాతాలో పడనున్నాయి.

మహిళలకే చైర్‌పర్సన్‌ పీఠాలు..

జిల్లాలో అన్ని నగర పాలక, పురపాలక సంస్థల్లో మహిళలకే పట్టం కట్టనున్నారు. ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పురుషులకు నిరాశే ఎదురైంది. ఇప్పుడంతా ఆ మహిళా నాయకుల కోసం అన్వేషణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో మహిళలనే పెడదామా? మరొకరిని ఎంపిక చేయాలా? అన్నదానిపై ఆలోచనలో పడ్డారు. ప్రధాన రాజకీయ పక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేసే పనిలో ఉన్నాయి. ఎవరైతే బాగుంటారు? ఎవరైతే గెలుస్తారు? ఎవరిని పెడితే అనుకూలగా ఉంటుంది? ప్రతికూలమయ్యే పరిస్థితులేంటి అన్నదానిపై తర్జన భర్జనలు పడుతున్నారు.

కూటమిలో త్రిముఖ చర్చ..

ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీలో ఒక్కటే నిర్ణయం కానుంది. పార్టీ అధిష్టానం ఎవరిని డిసైడ్‌ చేస్తే వారే అభ్యర్థి కానున్నారు. ఆ దిశగా మంతనాలు జరుగుతున్నాయి. కానీ, కూటమిలో పరిస్థితి భిన్నంగా ఉంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌ దగ్గరి నుంచి మున్సిపాల్టీల వరకు ఇదే గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌పై టీడీపీ ఇప్పటికే బోలెడు ఆశలు పెట్టుకుంది. కానీ, జనసేన, బీజేపీ కూడా అడుగుతున్నాయి. మిగతా మున్సిపాల్టీల్లో కూడా పోటీ పడుతున్నాయి. ఈ పంచాయతీ తేల్చుకున్నాకనే కూటమిలో స్పష్టత రానుంది. అంతవరకు ఎవరి ఆశలు వారివే.

..

శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మహిళ

ఇచ్ఛాపురం మున్సిపాలిటీ

బీసీ మహిళ

పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ

జనరల్‌ మహిళ

ఆమదాలవలస మున్సిపాలిటీ

జనరల్‌ మహిళ

రిజర్వేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement